క్షత్రియులు



క్షత్రియులు (Kshatriya) అనునది హిందూ మతములోని పురాణాల ప్రకారం చతుర్వర్ణ్యాలలో రెండవది క్షత్రియ వర్ణం. "క్షత్రాత్ త్రాయత ఇతి క్షత్రః, తస్య అపత్యం పుమాన్ క్షత్రియః" - అనగా ప్రజలను సమస్త దుష్టత్వం నుండి రక్షించి పరిపాలించువాడు క్షత్రియుడు. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం క్షత్రియులు యుద్ధ వీరులు, సామ్రాజ్యాలు పరిపాలించవలసినవారు. భారతీయ మత గ్రంథాలల్లో పేర్కొనబడిన శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వంటి ఎందరో దైవస్వరూపులు క్షత్రియులుగా జన్మించారు. వట వృక్షము (మర్రి చెట్టు), దండము మరియు రెండు ఖడ్గాలతో కూడిన డాలు క్షత్రియుల చిహ్నాలుగా నిలుస్తాయి. క్షత్రియుడు అనే పదానికి స్త్రీ లింగము - క్షత్రియాణి.
ఆదిలో క్షత్రియులు అనునది ఆర్యుల తెగల్లో ఒక చీలికగాయున్నది. ఆర్యుల సమాజం వృత్తిని బట్టి కులవిభజన జరిగినప్పటికీ, తరువాత కాలంలో గుణమును బట్టి, మధ్యయుగంలో జన్మను బట్టి క్షత్రియ అనే పదము భావించబడింది. క్షత్రియ సామ్రాజ్యాల పతనానంతరం కాలక్రమేణా మధ్య యుగంలో ఆయా వంశస్తులు కులాలుగా ఏర్పడ్డారు. సప్త ఋషులు (లేక వారి ప్రవరలు) మూలపురుషుల పేర్లతో గోత్రాలు ఉండి, క్షత్రియ ధర్మంతో పాటూ వైదిక ధర్మాలు ఆచరించిన కులాలు మాత్రం వైదిక క్షత్రియ కులాలుగా రూపాంతరం చెందాయి. నేడు స్వతంత్ర భారత దేశంలో అనేక క్షత్రియ కులాలు గుర్తింపబడ్డాయి. ప్రస్తుతానికి వివిధ రాష్ట్రాల్లో వైదిక క్షత్రియులు ఈ క్రింది విధాలుగా పిలువబడుచున్నారు.
  • ఆంధ్ర ప్రదేశ్ - క్షత్రియులు, రాజులు; కర్నాటక - రాజులు; కేరళ - రాజా, వర్మ; తమిళనాడు - రాజా; రాజస్థాన్ - రాజపుత్రుడు;ఉత్తర ప్రదేశ్ - సింగ్; మధ్యప్రదేశ్ - ఠాకూరు, సింధియా; బెంగాల్ - బోస్; హర్యానా - వర్మ; కాశ్మీర్ - సింగ్; గుజరాత్ - సోలంకి.

వంశాలు[మార్చు]

క్షత్రియులకు వంశాలు నాలుగు. అవి ఏమనగా 1. సూర్యవంశం, 2. చంద్రవంశం, 3. అగ్నివంశం, 4. నాగవంశం.
  • సూర్యవంశం : సూర్యవంశాన్ని ఇక్ష్వాకువు స్ఠాపించాడు. కనుక ఈ వంశాన్ని ఇక్ష్వాకు వంశమని కూడా అందురు. రామాయణంలో శ్రీరాముడు, జైనమతాన్ని స్థాపించిన వర్ధమాన మహావీరుడు ఈ వంశానికి చెందినవారు. పంజాబి క్షత్రియులైన కత్రియులు, రాజస్థానీ క్షత్రియుల్లో 10 రాజపుత్ర తెగలు, ఆంధ్ర ప్రదేశ్ లో రాజులు (ఆంధ్ర క్షత్రియులు) ఒడిస్సాలో వీరిని ఒడియా (వడియ) రాజులు అందురు.ఆంధ్ర ప్రదేశ్ లోని కొల్లేరు సరస్సుకు గజపతుల కాలంలో (14-15 శతాబ్దంలో) ఒరిస్సా నుండి వలస వచ్చిన సూర్యవంశం వడియరాజులను వడ్డీలుగా [1] పిలుస్తారు వారు ఈ వంశానికి చెందినవారు.
  • చంద్రవంశం : క్రీస్తు పూర్వం సుమారు 3000 సంవత్సరాల క్రితం జీవించిన శ్రీకృష్ణుడు చంద్రవంశంలో గొప్పవాడు. చంద్రవంశంలో వృషిణి తెగకు చెందిన శ్రీకృష్ణుడు వేద వ్యాసుడు వ్రాసిన మహాభారత గ్రంథంలో భగవంతుడిగా పేర్కొనబడ్డాడు.
  • అగ్నివంశం : బధారియ, చౌహాన్, పరిహార్, పన్వర్ మరియు సోలంకి మొదలగు తెగలు అగ్నివంశానికి చెందినవి. ఆజ్మీరును పరిపాలించిన పృధ్వీరాజ్ చౌహాన్ అగ్నివంశంలో గొప్పవాడు, ఆఖరివాడు. ఆంధ్రప్రాంతమునందు వీరిని "అగ్నికులక్షత్రియులు" అందురు.
  • నాగవంశం : నాగుపాములను పూజించే తెగ నాగవంశం. వీరు ప్రధానంగా శైవులు. వీరిలో నైర్, బంట్, సహారా, బైస్, నాగ, తక్షక, జాట్ తెగలు ఉన్నాయి.

దేశ, ప్రపంచ వ్యాప్తం గా క్షత్రియ జాతులు[మార్చు]


క్షత్రియునిగా జన్మించిన గౌతమ బుద్ధుడు.
  • వాయువ్వ భారత దేశం: అహిర్, జాట్ లు, గుజ్జారులు, రాజపుత్రులు
  • ఈశాన్య భారతదేశం: మణిపురి క్షత్రియ, అహొం, త్రిపురి క్షత్రియ
  • నేపాల్, హిమాలయాలు: పహాడీ రాజపుత్రులు, ఛెత్రి, శ్రేష్ఠ, శాక్య, థకురి, థప
  • దక్కను భారతదేశం: 96 కులి మరాఠాలలో ఒక తెగయైన మరాఠ, క్షత్రియ రాజులు (ఆంధ్ర క్షత్రియులు)
  • తూర్పు భారతదేశం: థాకూర్, ఖండాయత్
  • దక్షిణ భారతదేశం: తమిళ క్షత్రియ, తులునాడు క్షత్రియ, కూర్గులు (కొడవులు), సామంత క్షత్రియులు, పురగిరి క్షత్రియ/పెరిక క్షత్రియులు
  • ఇండోనేషియా: బాలనీయులు, జవనీయులు

క్షత్రియ జాతుల వివరణ[మార్చు]

అహీరాలు (లేక అభీరాలు) : వీరికే యాదవులు అని పేరు. బీహార్, బెంగాల్, తూర్పు దిశ మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో కన్పిస్తారు. ప్రధానంగా వీరు పశువులను మేపుకుంటారు. ఇరానీ స్కైతీయులు, కుషాణుల చేత వీరు భారతదేశానికి తరుమబడ్డారు. తర్వాత క్రీస్తు శకం 108 లో మాళవ, సౌరాష్ట్ర, మహారాష్ట్ర ప్రాంతాల్లో వారి సామ్రాజ్యాన్ని స్థాపించి 167 సంవత్సరాలు పాలించారు. రమండలిక మొదటి రాజు. భుభన్ సింహ ఆఖరి రాజు. కిరాతుల దాడితో ఆహీరా సామ్రాజ్యం కూలిపోయింది. మహాభారతంలో శ్రీ కృష్ణుడు ఈ తెగకు చెందినవాడు.
జాట్ లు: వీరు పంజాబ్, హర్యానా, బెలుచిస్థాన్, జమ్ము, కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉండే ఇండో ఆర్యన్ తెగలు. రాజపుత్రుల వలే వీరు కూడా యుద్ధ వీరులు. మహారాజా సూరజ్ మల్ వీరి పూర్వీకుడు. జాట్ తెగలలో 36 రాజవంశాలు ఉన్నాయి.
గుజ్జారులు (లేక గుర్జారులు) : వీరు ఇండియా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో కనిపిస్తారు. గుజ్జారుల జన్మస్థానం తెలియదు. కాని భారతదేశంలో హూణుల పాలన సమయంలో ఉన్నారు. 6 నుండి 12 శతాబ్దాలలో వీరు క్షత్రియులు, బ్రాహ్మణులుగా విభజింపబడ్డారు. దక్షిణ ఆసియాను ముస్లిములు పాలించినప్పుడు వీరిలో చాలా వరకూ ఇస్లాం మతంలోకి చేరారు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వీరు వెనుకబడిన తరగతులుగా పరిగణింపబడుచున్నారు. హిందూ గుజ్జారులలో చాలా వర్ణాలు ఉన్నాయి. గుజ్జారులలో చాలా వరకూ సూర్యవంశానికి చెందినవారు. రాజస్థాన్ లో భిన్మల్ అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని కొంత ప్రాంతాన్ని పాలించారు. భారత దేశంలో గుజ్జారులు హర్యానా, పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పడమర ఉత్తరప్రదేశ్ లలో కన్పిస్తారు. పండితుడు వి.ఎ స్మిత్ ప్రకారం అజ్మీరును పాలించిన అగ్నికుల రాజపుత్రుడు - సమ్రాట్ పృధ్వీరాజ్ చౌహాన్ (1149 - 1192) గుజ్జార జాతికి చెందినవాడు. గుజ్జారుల్లో సిక్కులు కూడా ఉన్నారు. గుజ్జారుల్లో రాజవంశాలు - గుర్జార-ప్రతిహార, సోలంకి, చౌహాన్, తోమర, పార్మర, కసన గోత్రీయులు, మరియూ ఛప.
రాజపుత్రులు: ఉత్తర భారతదేశానికి చెందిన యుద్ధ వీరుల్లో ఒక జాతి. వీరు ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, జమ్ము, మధ్యప్రదేశ్, పంజాబ్, బీహార్, ఉత్తరాంచల్ వంటి రాష్ట్రాల్లోనే కాకుండా పాకిస్తాన్లో కూడా కనిపిస్తారు. వీరికి గుజ్జారులతోనూ, ఆంధ్ర క్షత్రియులతోనూ వివాహ సంబంధాలుండేవి. 6 నుండి 12 వ శతాబ్దాలవరకూ పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్, సౌరాష్ట్ర్ర రాజ్యాలు పాలించారు. వీరికి సూర్య, చంద్ర, అగ్ని వంశాలున్నాయి. మహారాణా ప్రతాప్, రాజా మాన్ సింగ్ వంటి ఎందరో మహారాజులు ఈ జాతికి చెందినవారు. సూర్య వంశంలో తెగలు - బైస్ రాజ్పుట్, ఛత్తర్, గౌర్ రాజ్పుట్, ఖచ్వాహ, మిన్హాస్, పఖ్రాల్, పుందిర్, నారు, రాథోడ్, సిసోదియ, సహారన్; చంద్రవంశంలో తెగలు - భటి రాజ్పుట్, ఛండెల, జాడన్, జడేజ, ఛూడసమ, కతోచ్, భంగాలియ, పహోర్, సవోమ్, తొమార; అగ్నివంశంలో తెగలు - భాల్, చౌహాన్, మోరీ, నాగ, పరమర, సోలంకి.
మణిపురి క్షత్రియులు: వీరు మణిపూర్ రాష్ట్రంలో మైతేయి తెగ మరియు మరో 3 తెగల నుండి ఆవిర్భవించిన వాళ్ళు. క్రీస్తు శకం 1720 లో వీరు హిందూ మతాన్ని స్వీకరించి క్షత్రియులలో కలిసారు. వీరిలో 7 తెగలు ఉన్నాయి.
అహోం: వీరు అస్సాంలో బ్రహ్మపుత్ర లోయ ప్రాంతాన్ని 6 శతాబ్దాలపాటూ, అనగా 1228 నుండి 1826 వరకూ పరిపాలించారు. ఈ సామ్ర్యాజ్యాన్ని చైనాకు చెందిన 'సుఖఫా' అను థాయ్ రాజు స్థాపించాడు. మోరానుల యుద్ధంతో అహోం సామ్రాజ్యం క్షీణించి, బర్మా చేత ఆక్రమింపబడి చివరకు 1826లో బ్రిటీషు పాలనలోకి వచ్చింది. అహోం సామ్రాజ్యాన్ని మొత్తం 41 మంది రాజులు పాలించారు. పురంధర్ సిన్హా అహోం ఆ ఆఖరి రాజు.
త్రిపురి క్షత్రియులు: వీరిలో త్రిపురి, రియాంగ్, జమాతియా, నవోతియ తెగలు ఉన్నాయి. త్రిపుర రాష్ట్రంలో నేటికీ రాచరికపు పాలన కొనసాగుతోంది. బెంగాలీ భాషలో వ్రాయబడిన 'రాజ్ మాల' (త్రిపుర రాజుల వంశావళి) ప్రకారము మాణిక్య సామ్రాజ్యంలో 15వ శతాబ్దం మొదలు 2006 వరకూ 185 మంది రాజులు పరిపాలించారు. బిర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య ఆఖరి రాజు 1947 లో మరణింఛాడు. ప్రస్తుత రాజు - మహారాజా కృత్ ప్రద్యోత్ దెబ్ బర్మన్ మాణిక్య బహదూర్.
పహాడీ రాజపత్రులు: వీరు భారత దేశ పాలన ఉన్న జమ్ముకాశ్మీర్, పాకిస్థాన్ పాలన ఉన్న ఆక్రమిత జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియూ ఉత్తరాఖండ్ లలో ఉన్న పిర్ పింజల్ వాలు ప్రాంతాల్లో నివసిస్తారు. వీరిలో ఇస్లాం మతం స్వీకరించిన వారు కూడా ఉన్నారు. ఇస్లాం మతం స్వీకరించిన రాజపుత్రులను ముస్లిం రాజపుత్రులని అందురు. పహాడీ రాజపుత్రులలో వంశావళి - బధన్, పరిహార్ రాజపుత్రులు, బైస్, భట్టి, బొంబా, ఛంబియల్, చౌహాన్, చిబ్, దొర్గా/ఛత్తర్, దొమాల్, దౌలీ, జాన్జువా, జర్రాల్, ఖఖా, ఖోఖర్, మంగ్రల్, మన్హాస్, నర్మా, సుల్ హ్రీయా, సా, లాల్హాల్, థాకార్.
ఛెత్రి: వీరు నేపాల్ దేశపు క్షత్రియులు. వీరిలో ఖాసా మరియు థాకూరి వంటి రాజవంశాలు ఉన్నాయి. 16 వ శతాబ్దంలో షా సామ్రాజ్యాన్ని యశో బ్రహ్మ షా అనే వాడు స్థాపించాడు. నేపాల్ లో రాచరికం 1768 లో మొదలయి 2008 వరకూ కొనసాగింది. మొదటి రాజు - మహారాజాధిరాజ పృధ్వీ నారాయణ్ షా. ఆఖరి రాజు - మహారాజాధిరాజ జ్ణానేంద్ర బీర్ బిక్రమ్ షా దేవ్.
శ్రేష్ఠ: నేపాల్ దేశంలో ఉండే వీరు ప్రధానంగా వర్తకులు. 'నెవార్' సంతతికి చెందిన వీరు ఖట్మండులో కనిపిస్తారు.
శాక్యులు: వీరు నేపాల్ దేశాన్ని క్రీస్తు పూర్వం 650–500 మధ్య పాలించారు. వీరిలో ప్రముఖుడు బౌద్ధ మతాన్ని స్థాపించిన సిద్ధార్ధ గౌతముడు (గౌతమ బుద్ధుడు).
థకూరి: వీరు కూడా నేపాల్ ను పాలించిన రాజులు. క్రీస్తు శకం 879 లో రాఘవ దేవ థకూరి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. రాఘవదేవ తర్వాత నేపాల్ ను 12 వ శతాబ్దం మధ్య వరకూ చాలా థకూరి రాజులు పాలించారు.
థప: థప అనేది నేపాల్ దేశంలో ఛెత్రి మరియూ మగర్ జాతులకు చెందిన ఇంటిపేరు. థప ఛెత్రిలు - టిబెట్, ఉత్తర భారతదేశం, మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల సంకర జాతి, థప్ మగర్ లు ఉత్తర నేపాల్ మరియు దక్షిణ టిబెట్ కు చెందిన వారు. షింటూ సతి నెన్ అనే రాజు కంగ్వాచన్ అనే సామ్రాజ్యాన్ని పాలించాడు. భీమ్ సేన్ థప నేపాల్ మొదటి ప్రధాన మంత్రి.
కులీ మరాఠాలు: మహారాష్ట్ర, గోవా, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపించే వీరిలో 96 తెగలు ఉన్నాయి. భోన్ స్లే తెగకు చెందిన ఛత్రపతి శివాజి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
రాజులు: ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి వంటి కోస్తా జిల్లాలలో కనిపించే వీరినే ఆంధ్ర క్షత్రియులు లేక క్షత్రియ రాజులు అని అందురు. సూర్య వంశానికి, చంద్ర వంశానికి చెందిన వీరు తూర్పుచాళుక్యులు, విష్ణుకుండినులు, కాకతీయ, వర్ణాట, గజపతి, ఛాగి, పరిచెద, ధరణికోట, కళింగ విజయనగర సామ్ర్యాజ్య వంశస్థులు. హిందూ పురాణాలు, బౌద్ధ, జైన మత గ్రంథాల ప్రకారం వీరు క్రీస్తు పూర్వమే ఉత్తర భారతదేశం నుండి కోస్తా ఆంధ్రకు వలస వచ్చారు. వీరికి రాజపుత్రులతో వివాహ సంబంధాలుండేవి. నేడు వీరి జనాభా కేవలం 1.2% మాత్రమే. ఆంధ్ర క్షత్రియులు రాయలసీమలోనూ మరియూ తమిళనాడు - రాజపాళయం లోనూ, అమెరికాలోనూ కొద్దిగా కన్పిస్తారు.
పెరిక క్షత్రియులు/పురగిరి క్షత్రియ: ఇతిహాసాల ప్రకారం వీరు పరశురాముడి క్షత్రియ వధ నుండి తప్పించుకున్నవారు. ఆ సమయంలో కొద్ది మంది క్షత్రియులు పిరికి తనంతో తాము వ్యాపారస్తులమని చావు నుండి తప్పించుకొన్నారు.అయితే వీరు పిరికి వారు, అబద్దాలాడేవారూ కాదు. కొద్ది మంది క్షత్రియులు తమ పదవులనుండి విరమణ పొందిన తర్వాత కొండ ప్రాంతాలకు వెళ్ళి అక్క నివాసాలు ఏర్పరచుకొన్నారని, కాల క్రమేణా వారు పురగిరి క్షత్రియులుగా పిలువబడ్డారు. అందువల్ల వీరిని పురగిరి క్షత్రియులని కూడా అంటారు. చంద్ర వంశానికి చెందిన వీరు ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపిస్తారు.
థాకూర్: వీరు నైరుతి భారత దేశంలో గుర్జార-ప్రతిహార మరియు కుషాణు ల సామ్రాజ్యాల వారసులయి ఉండవచ్చును. థాకూర్ అనే పదాన్ని రాజస్థాన్ రాజపుత్రులు, జాట్ లు బిరుదుగా వాడతారు, బెంగాలలో బ్రాహ్మణులు థాకూర్ పదాన్ని టాగూర్ అనే బిరుదుగా వాడతారు.
ఖండాయత్ లు: వీరు ఒడిశాను 16 వ శతాబ్దంలో పాలించారు. ఖండాయత్ లలో గోవింద విద్యాధర (క్రీ.శ.1542-1559) అనే రాజు గజపతిరాజుల్లో ఆఖరి రాజైన కాఖా రుద్రదేవుడుని హతమార్చి 'భోయ్' సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
తమిళ క్షత్రియులు: వన్నియకుల క్షత్రియులు లేక పల్లీలు అనబడే వీరు తమిళనాడు, కేరళ లలోని చాలా ప్రాంతాలు పాలించారు. తమిళనాడులో వీరిని గౌండర్, పదయాశ్చి, నైఖర్, రెడ్డియార్, కందర్, పల్లి అని; పాండిచ్చెరిలో - వన్నియార్, రెడ్డియార్, పదయాశ్చి అని, కర్ణాటకలో తిగల/తిగలారు అని; ఆంధ్ర ప్రదేశ్ లో అనామకులు, ఆర్యమాల, బావురి, ఆగ్నికుల, వన్నె కాపు, వన్నె రెడ్డి అని పిలుస్తారు. పల్లవ రాజుల కాలంలో వీరు సైనికులుగా, సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. పూర్తి వ్యాసమునకు అగ్నికులక్షత్రియులు చూడండి.
తులునాడు క్షత్రియ: వీరినే బంట్స్ లేక బంట్లు అని అందురు. నాగవంశానికి చెందిన వీరు కర్ణాటకలో ఉన్న తులునాడులో కన్పిస్తారు. అలుపాస్ అనే బంట్లు కేరళలో కాసరగోడు నుండి కర్ణాటకలో గోకర్ణ వరకు బంట్లు 'అల్వ ఖేద' సామ్రాజ్యాన్ని స్థాపించి క్రీస్తు శకం 450 నుండి 1450 వరకు పాలించారు. ఉడిపి, మంగళూరు, ముంబై లలో కూడా వీరు కన్పిస్తారు. వీరిని నాయక, నాడవ, శాస్త్రే (లేక శెట్టి) అని కూడా అందురు.
కూర్గులు (కొడవులు) : కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కొడగు జిల్లాలో కన్పించే వీరు వ్యవసాయదారులు మరియు యుద్ధ వీరులు. స్కంద పురాణం ప్రకారం చంద్రవంశ క్షత్రియుడైన చంద్రవర్మ వీరి పూర్వీకుడని చెప్పవచ్చు.
సామంత క్షత్రియులు: నాగవంశానికి, చంద్ర వంశానికి చెందిన వీరు కేరళ రాష్ట్రంలో కన్పిస్తారు. నైర్ (లేక నాయర్) అనేది వీరి మరో పేరు. సామంత క్షత్రియులలో - తిరువాన్కూరు, థంపన్, తిరుమల్ పడ్ వంటి రాజవంశాలు చంద్రవంశానికి చెందినవి. మార్తాండ వర్మ (1729–1758) తిరువాన్కూరు సామ్రాజ్య వ్యవస్థాపకుడు.
బాలనీయులు: నాగవంశానికి చెందిన వీరు ఇండోనేషియాలో ఉన్న బాలి అనే ద్వీపంలో కన్పిస్తారు. దేవ అగుంగ్ (క్రీ.శ.1686. 1722) బాలి ద్వీపాన్ని 500 సంవత్సరాల క్రితం పాలించాడు. ఇంచుమించు బాలనీయ క్షత్రియులందరూ దేవ అగుంగ్ వారసులే. క్రీస్తు శకం 914లో శ్రీ కేసరి వర్మ దేవ 'వర్మ దేవ' సామ్రాజ్యాన్ని స్థాపించాడు. క్రీస్తు శకం 1133 లో శ్రీ జయశక్తి 'జయ' సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
జవనీయులు: వీరు ఇండోనేషియా - జావా ద్వీపంలో కన్పిస్తారు. అక్కడ వీరిని ఖ్బో అని, మహిస అని, రంఘ అని పిలుస్తారు. జావాను పాలించిన రాజుల్లో చాలా మంది వైశ్య కులానికి చెందినవారు. 17 వ శతాబ్దంలో ఇస్లాం దాడుల వలన జావనీయులు అంతరించిపోయారు. ఇప్పుడు జావా ద్వీపంలో కేవలం బాలనీయులు, మరియు ఇతర కులస్తులు మాత్రమే ఉన్నారు.
వైదిక క్షత్రియులకు మూలపురుషులుగా సాధారణంగా సప్త ఋషులు, వారి ప్రవరలు, వంశంలో ప్రముఖ వ్యక్తులు ఉంటారు. వారి పేర్లు గోత్ర నామాలుగా కలిగివుంటాయి.

17 comments:

  1. Jai Suryavamsam VadiyaRajulu

    ReplyDelete
  2. Jai Suryavamsam VadiyaRajulu

    ReplyDelete
  3. తెలుగు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు వడియ రాజ క్షత్రియులు (వడ్డె రాజులు) వడియ రాజ క్షత్రియులు గురించి పూర్తి వ్యాసం వ్రాయండి
    Vadderaju -OC
    VADIYARAJ -BC-A
    VADDI -BC-A
    Vaddera -BC-A

    ఆంధ్రప్రదేశ్ లోని కేవలం కొంతమంది కొల్లేరు ప్రాంతంలోని వడియ రాజులను వడ్డీలుగా పిలుస్తారు,వీరి ప్రధానవృత్తి ఆక్వాకల్చర్ వీరికి చేపల చెరువులు,రొయ్యల చెరువులు కలవు,మిగిలిన ప్రాంతంలోని వడియరాజ క్షత్రియులు అందరూ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లుగా,బిల్డర్లుగా,సివిల్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు, ఒడియరాజ క్షత్రియులు గురించి వివరాలు పూర్తిగా తెలుసుకుని వ్యాసం పొడిగించి వ్రయాల్సిందిగా కోరుకుంటున్నాను.
    జై సూర్యవంశం ఒడియరాజ క్షత్రియ
    ఇట్లు చల్లా శ్రీనివాసరాజు క్షత్రియ
    ప్రకాశం జిల్లా

    ReplyDelete
    Replies
    1. Bro, Vadderaju - OC Loki vastundhi ani ekkada nundi cheptunnaru.. Konchem reference cheptara?

      Delete
  4. తెలంగాణ,ఆంద్ర,మహారాష్ట్ర,కర్ణాటక లలో ఉన్న బంజారా లు కూడా క్షత్రియులే. ఉత్తర భారత దేశం నుంచి పూర్వం దక్షిణ భారత దేశానికి వలస వచ్చారు. Marwadi lambadi ఓకే జాతి. బంజారా ప్రజల పెరు చివరన రాథోడ్,చౌహాన్,జాదవ్,పవార్ లు వారికీ సాక్ష్యం

    ReplyDelete
    Replies
    1. Avunu.. Prasent dhesamlo yentho mandhi rajakiyanaikulu, cinemavaallu, cricketerlu unnaru, maharastra lo ee intiperlu unnavaallantha rajaput vadderla list lo choodochu, vaddar samaj community lo choodochu, example saradh pawar, Ms dhoni, kedhar jadhav, vallabai patil, vadderaju ki inka Chala mandhi unnaru Mana indialo.. ivvanni nadipinchedhi sairat cinema producer and director nagaraju manjule.

      Delete
    2. హలో మిస్టర్ మీకు చరిత్ర తెలిస్తే మాట్లడండి చరిత్ర తెలియకుండా మాట్లాడవద్దు వడియ రాజులకీ బంజారాలకి సంభంధం లేదు; ఇంకా చెప్పాలంటే వడియ రాజులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిలిచే "oc" ఆంధ్ర క్షత్రియులని వడియ రాజులు తక్కువగా చూస్తారు ఎందుకంటే వడియ రాజులకు ఉండే గొప్పతనం అలాంటిది చరిత్ర తెలియకుండా మాట్లాడవద్దు

      Delete
    3. హలో మిస్టర్ మీకు చరిత్ర తెలిస్తే మాట్లడండి చరిత్ర తెలియకుండా మాట్లాడవద్దు వడియ రాజులకీ బంజారాలకి సంభంధం లేదు; ఇంకా చెప్పాలంటే వడియ రాజులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిలిచే "oc" ఆంధ్ర క్షత్రియులని వడియ రాజులు తక్కువగా చూస్తారు ఎందుకంటే వడియ రాజులకు ఉండే గొప్పతనం అలాంటిది చరిత్ర తెలియకుండా మాట్లాడవద్దు

      Delete
  5. మీరు ఇప్పుడు క్షత్రియులు అని చెప్తున్న రాజపుత్రులు,బంజారాలు ఒకే వంశం కి చెందిన వారు....మొఘల్,ఆంగ్లేయుల తో సంధి చేసుకొని,వారితో వివాహ సంబంధాలు ఏర్పరచిన వాళ్ళు రాజపుత్రులుగా పిలవబడుతున్నారు .బానిసత్వం ని అంగీకరించని బంజారాలు సిక్కులతో కలిసి మొఘల్స్ కి వ్యతిరేకంగా యుద్ధాలు చేశారు....దీనికి సాక్ష్యం గురు గ్రంథ సాహిబ్...

    ReplyDelete
  6. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో "oc" లో ఉన్న క్షత్రియులు అందరూ ఒక ఒక జాతికి చెందిన వారు కాదు, ఒక సంస్కృతికి చెందిన వారు కాదు,కాలక్రమంలో వీరందరూ కలిసి ఒక సమూహంగా మారి, కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు ఒక కూటమిగా చేరి క్షత్రియ "oc" నామకరణం చేసుకుని జీవిస్తున్నారు, ఆంధ్ర క్షత్రియ "oc" లో ఎక్కువమంది సామంతులు సామంతులు రాజులు అని పిలుస్తారు, వీరిలో ఎక్కువమంది బ్రిటిష్ వారికి అనుకూలంగా పని చేసి వారి ఆస్తులు కాపాడున్నారు, ఈ సామంత రాజుల్లో గోదావరి జిల్లాలో ఎక్కువమంది చేపల చెరువుల వ్యాపారం, రొయ్యల చెరువులు వ్యాపారం ప్రధాన వృత్తిగా ఉండేది, వీరందరూ ఎక్కువ గోదావరి జిల్లాల ప్రాంతంలోనే కనిపిస్తారు,మిగతా ప్రాంతంలో కనిపించరు, వీరిలో కొంతమంది ఎక్కువగా బ్రాహ్మణ క్షత్రియులు ఉన్నారని చెప్పుకుంటున్నారు, ఎక్కువమంది సామంత రాజులు అని చెప్పుకుంటున్నారు, కొన్ని వివరాలు ఇంకా బయటకు తెలియాలి, కొంతమంది "BC" విభాగానికి చెందిన వారిని కూడా ఆంధ్రక్షత్రియ "OC" విభాగంలో కలిపేసుకున్నారు, హీరో ప్రభాస్ రాజు, కృష్ణంరాజు ఆ కోవకు చెందిన వారే, ఆంధ్రక్షత్రియ "OC" లకు, విజయనగరం పూసపాటి గజపతి రాజులకు చాలా తేడా,వాళ్ళకి వీరికీ ఆచార వ్యవహారాల్లో చాలా వ్యత్యాసం ఉంది, ఆంధ్రప్రదేశ్లో క్షత్రియులు కేవలం1% మాత్రమే ఉన్నారనేది పచ్చి అబద్ధం, ఆంధ్రప్రదేశ్లో చాలా సంస్థానాలు ఉన్నాయి,వారిలో చాలామంది సామంత రాజులతో కలవడం ఇష్టం లేక వారి వివరాలు నమోదు చేసుకోలేదు,ఆంధ్రప్రదేశ్లో చాలామంది ముందు జాగ్రత్తపడి రిజర్వేషన్లు సంపాదించుకున్నారు, వీరిలో ఎక్కువమంది "BC" విభాగంలో ఉన్నారు, విషయం తెలియక ఆంధ్రప్రదేశ్లో "OC" లో 1% మాత్రమే క్షత్రియులు అని అబద్దాలు మాట్లాడటం మిగతా వారి గురించి తెలియకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు,

    ఆంధ్ర క్షత్రియ "oc" లో ఎక్కువమంది సామంతులు సామంతులు రాజులు అని పిలుస్తారు, వీరిలో ఎక్కువమంది బ్రిటిష్ వారికి అనుకూలంగా పని చేసి వారి ఆస్తులు కాపాడున్నారు, ఈ సామంత రాజుల్లో గోదావరి జిల్లాలో ఎక్కువమంది చేపల చెరువుల వ్యాపారం, రొయ్యల చెరువులు వ్యాపారం ప్రధాన వృత్తిగా ఉండేది, వీరందరూ ఎక్కువ గోదావరి జిల్లాల ప్రాంతంలోనే కనిపిస్తారు,మిగతా ప్రాంతంలో కనిపించరు, వీరిలో కొంతమంది ఎక్కువగా బ్రాహ్మణ క్షత్రియులు ఉన్నారని చెప్పుకుంటున్నారు, ఎక్కువమంది సామంత రాజులు అని చెప్పుకుంటున్నారు,

    ReplyDelete
    Replies
    1. మనం ఎన్ని గొప్పలైనా పోతాం ఇంకోడి గొప్పని ఒప్పుకోము......అందరం కలవం... అదే..మన బలహీనత..

      Delete
  7. హలో మిస్టర్ మీకు చరిత్ర తెలిస్తే మాట్లడండి చరిత్ర తెలియకుండా మాట్లాడవద్దు వడియ రాజులకీ బంజారాలకి సంభంధం లేదు; ఇంకా చెప్పాలంటే వడియ రాజులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పిలిచే "oc" ఆంధ్ర క్షత్రియులని వడియ రాజులు తక్కువగా చూస్తారు ఎందుకంటే వడియ రాజులకు ఉండే గొప్పతనం అలాంటిది చరిత్ర తెలియకుండా మాట్లాడవద్దు

    ReplyDelete
  8. కాలక్రమంలో కొంతమంది క్షత్రియులు చాలా జాతులతో వివాహం జరిగింది వారిలో కొంతమంది బంజారాలు కూడా ఉండి ఉండవచ్చు అంతేకానీ అందరూ క్షత్రియులు అని చెప్పడం ఎంతవరకు నిజం ?

    ReplyDelete
  9. Agnikula kshtriyas kshtriyas kadu daneki vari gotrali nedarsanam.vallani kshtriyas list lo tesiviyandi.leda vallu kshtriyas anataneki edina proofu pettamdi.100%pakka kshtriyas Karu

    ReplyDelete
  10. Thogataveera kshatriya gurinchi wrayandi sir

    ReplyDelete

  11. Thogata Veera Kshatriyas(Ayodhya) comes under Suryavamsa Kshatriya
    - Kings and feudal lords who ruled various regions in Andhra Pradesh and Telangana (1200-1700 CE). Some of the notable dynasties founded by the Thogata Veera Kshatriyas:*Eruva Dynasty* (14th-19th centuries), *Bobbili Dynasty* (16th-18th centuries),*Madanapalle Dynasty* (15th-17th centuries),*Gudiyatham Dynasty* (14th-16th centuries),*Kadapa Dynasty* (15th-17th centuries),*Kurnool Dynasty* (16th-18th centuries)

    ReplyDelete