పరిచయము
సంబంధిత విషయాలు
|
వేద కాలం నుండి మధ్య యుగం వరకూ క్షత్రియ రాజ్యాలు భారత దేశంలో చాలా ప్రాంతాలను పాలించాయి. ఉత్తర భారత దేశంలో రాజస్థాన్ను పాలించిన క్షత్రియులనురాజపుత్రులు (Rajputs) అని అన్నట్లే దక్షిణ భారత దేశంలో ఆంధ్ర దేశాన్ని పాలించిన క్షత్రియులను ఆంధ్ర క్షత్రియులు లేదా ఆంధ్ర రాజులు అని అనడం కద్దు. ఆంధ్ర దేశాన్ని క్రీస్తు పూర్వం నుండి ఆంధ్ర క్షత్రియులు శతాబ్దాల పాటూ పాలించారు. వీరు బ్రాహ్మణులు, భట్ట రాజులు వంటి వారిని మంత్రులుగా, పూజారులుగా, ఆస్థాన కవులుగా నియమించుకొనేవారు. సైన్యంలో దూర్జయ, బోయ, పల్లీలు వంటి కులాలవారిని సైనికులుగా, సైన్యాధ్యక్షులుగా, సామంతులుగా నియమించుకొనేవారు. స్టడీస్ ఇన్ సౌత్ ఇండియన్ జైనిజం, పార్ట్ 2: ఆంధ్ర - కర్ణాటక జైనిజం అనే పుస్తకములో ఆంధ్ర రాజులు ఆంధ్ర రాజపుత్రులుగా అభివర్ణించబడ్డారు [1]. ఫ్రెంచి, బ్రిటీషు, మహమ్మదీయుల దాడులతో క్షత్రియ సామ్రాజ్యాలు అంతమయ్యాయి.
తూర్పు చాళుక్యులు[మార్చు]
వీరు చంద్రవంశానికి చెందినవారు. ప్రసిద్ధి గాంచిన పశ్చిమ బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేసి (క్రీ.శ.608–644) తూర్పున ఉన్న దక్కన్ ప్రదేశాన్ని (ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాలను) క్రీ.శ. 616 సంవత్సరంలో, విష్ణుకుండినులను ఓడించి, తన అధీనంలోకి తీసుకొన్నాడు. రెండవ పులకేసి తన సోదరుడైన కుబ్జ విష్ణువర్ధనుడిని అక్కడ తన ప్రతినిధిగా నియమించాడు. రెండవ పులకేసి మరణించాక ఈ ప్రాంతం యొక్క ప్రాతినిధ్యం పెరిగి ఒక స్వతంత్ర వేంగి సామ్రాజ్యంగా పరిణితి చెందింది. తూర్పు చాళుక్యులలో పరిపాలించిన రాజుల పేర్లు ఇవి:
- కుబ్జ విష్ణువర్ధనుడు (624 – 641 C.E.)
- జయసింహ 1 (641 – 673 C.E.)
- ఇంద్రబట్టారకుడు (673 C.E.,seven days)
- విష్ణువర్ధనుడు 2 (673 – 682 C.E.)
- మాంగే యువరాజా (682 – 706 C.E.)
- జయసింహ 2 (706 – 718 C.E.)
- కొక్కిలి (718-719 C.E., six months)
- విష్ణువర్ధనుడు III (719 – 755 C.E.)
- విజయ ఆదిత్య I (755 – 772 C.E.)
- విష్ణువర్ధన IV (772 – 808 C.E.)
- విజయ్ ఆదిత్య II (808 – 847 C.E.)
- విష్ణువర్ధన V (847– 849 C.E.)
- విజయ్ ఆదిత్య III (849 – 892 C.E.) తన సోదరులతో: విక్రం ఆదిత్య I, యుద్ధ మల్ల I
- చాళుక్య భీమ I (892 – 921 C.E.)
- విజయ్ ఆదిత్య IV (921 C.E., 6 నెలలు)
- అమ్మ I, విష్ణువర్ధన VI (921 – 927 C.E.)
- విజయ్ ఆదిత్య V (927 C.E., 15 రోజులు)
- తదప (927 C.E., 1 నెల)
- విక్రం ఆదిత్య II (927 – 928 C.E.)
- చాళుక్య భీమ II (928 - 929 C.E.)
- యుద్ధ మల్ల II (929 – 935 C.E.)
- చాళుక్య భీమ III, విష్ణువర్ధన VII (935 – 947 C.E.)
- అమ్మ II (947 – 970 C.E.)
- దానర్ణవ (970 – 973 C.E.)
- జాత చోడ భీమ (973 - 999 C.E.)
- శక్తి వర్మ I (999 - 1011 C.E.)
- విమలాదిత్య (1011 – 1018 C.E.)
- రాజరాజ I నరేంద్ర విష్ణువర్ధన విష్ణువర్ధనుడు VIII (1018 – 1061 C.E.)
- శక్తి వర్మ II (1062 C.E.)
- విజయ్ ఆదిత్య VI (1063 – 1068 C.E., 1072 – 1075 C.E.)
- రాజరాజ II (1075 - 1079)
- వీర చోళ విష్ణువర్ధన IX (1079 - 1102
పూర్తి వ్యాసం కొరకు తూర్పు చాళుక్యులు చదవండి.
ధరణి కోట రాజులు[మార్చు]
చంద్ర వంశం, ధనుంజయ గోత్రీకులైన కోట వంశం వారు క్రీస్తు శకం 8 - 12 శతాబ్దాలలో ధరణికోటను రాజధానిగా చేసుకొని గుంటూరు జిల్లాను పాలించారు . వీరు మొదటిగా జైన మతం ఆచరించినప్పటికీ తర్వాత హిందూ మతాన్ని ప్రోత్సాహించారు., హిందూ దేవాలయాలను కట్టించారు. వీరు చాలా కాలం స్వతంత్రులైనప్పటికీ తర్వాత కాకతీయులకు సామంతులైయ్యారు. వీరికి తూర్పుచాళుక్యులు, పరిచ్చేదులు, కాకతీయులు, ఛాగి మరియు కలచురిలతోను వివాహ సంబంధాలు ఉండేవి. కోట బెతరాజు కాకతీయ గణపతి దేవుడి కుమార్తె అయిన గణపాంబను వివాహం చేసుకొన్నాడు. దాట్ల, దంతులూరి, జంపన వంటి కుటుంబాలకు పూర్వీకుడైన కోట కెతరాజు 1182 లో సింహాసనాన్ని అధిష్టించాడు. ధరణికోట రాజులలో పరిపాలించిన రాజుల పేర్లు ఇవి:
- కోట హరిసీమ కృష్ణుడు - సామ్రాజ్య వ్యవస్థాపకుడు;
- కోట భీమరాజు 1 - 1100 AD;
- కోట కేతరాజు 1 - 1130 AD; కోట భీమరాజు 2;
- కోట కేతరాజు 2 - 1182 AD to 1232 AD; కోట రుద్రరాజు;
- కోట బెతరాజు - 1268 AD.
పూర్తి వ్యాసం కొరకు కోట సామ్రాజ్యము చూడండి.
కాకతీయులు[మార్చు]
సూర్యవంశీకులైన కాకతీయులు ఓరుగల్లు (వరంగల్) ని రాజధానిగా చేసుకుని 1083 నుండి 1323 వరకూ ఆంధ్ర దేశాన్ని పాలించారు. వీరికి చంద్ర వంశీయులైన తూర్పు చాళుక్యులతోను, ధరణికోట రాజులతోను వివాహ సంబంధాలుండేవి. కుమారులు లేకపోవడంతో గణపతి దేవుడు దూర్జయ అనే శూద్ర జాతికి చెందిన నారమ్మ మరియు పేరమ్మ అను కన్యలను వివాహమాడాడు. గణపతిదేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని తూర్పుచాళుక్య వంశస్తుడు-నిడదవోలు యువరాజు అయిన వీరభద్రునికి ఇచ్చి వివాహం చేశాడు, రెండవ కుమార్తె గణపాంబను ధరణికోటకు చెందిన కోట బెతరాజుకు ఇచ్చి వివాహం చేశాడు.
కాకతీయులలో పాలించిన రాజులు వీరు:
- బెతరాజు (1000 -1030),
- ప్రోలరాజు (1030–1075),
- బెతరాజు 2 (1075–1110),
- ప్రోలరాజు 2 (1110–1158),
- ప్రతాపరుద్ర / రుద్రదేవ 1 (1158–1195),
- మహాదేవ (1195–1198),
- గణపతి దేవ (1199–1261),
- రుద్రమదేవి (1262–1296),
- ప్రతాపరుద్ర/రుద్రదేవ 2 (1296–1323).
విష్ణుకుండినులు[మార్చు]
ఇంద్రపాలనగరాన్ని రాజధానిగా చేసుకొని నల్లగొండ జిల్లాను పాలించిన వీరు కౌండిన్య గోత్రానికి చెందినవారు. మాధవ వర్మ హయంలో విష్ణుకుండినులు స్వతంత్రులై శాలంకాయనుల నుండి కోస్తా ఆంధ్రను చేజిక్కించుకున్నారు. విష్ణుకుండినులలో పాలించిన రాజులు వీరు:
- ఇంద్రవర్మ ( last 1/4 of 4 CE);
- మాధవ వర్మ; గోవిందవర్మ; మాధవవర్మ 2 (461-508 C.E.);
- విక్రమేంద్రవర్మ (508–528 C.E.);
- విక్రమేంద్రవర్మ (555–569 C.E);
- గోవిందవర్మ 2
ఆంధ్ర ఇక్ష్వాకులు[మార్చు]
సూర్య వంశానికి చెందిన వీరు విజయపురి (నాగార్జున కొండ) ను రాజధానిగా చేసుకొని కృష్ణానది తూర్పు దిక్కు ప్రాంతాలను క్రీస్తు శకం 2 వ శతాబ్దంలో పాలించారు. పురాణాల ప్రకారం వీరిలో 100 మంది రాజులున్నా, శిలాశాసనాల్లో మాత్రం నాలుగు పేర్లే లభించాయి.
- వశిష్టపుత్త శ్రీ శాంతముల;
- వీరపురుష దత్త;
- ఎహువుల శాంతముల;
- రుద్రపురుష దత్త
చోళులు[మార్చు]
చోళులు తమిళ సామ్రాజ్యానికి చెందినవారైనప్పటికీ వీరు క్రీస్తు పూర్వం 300 - క్రీస్తు శకం 1279 మధ్య శ్రీలంక నుండి వెంగి (పశ్చిమ గోదావరి - ఏలూరు సమీపంలో చెందిన పెదవేగి, చినవేగి, దెందులూరు ప్రాంతాలు) వరకూ పాలించారు. మధ్య యుగ చోళులలో పాలించిన రాజులు ఎవరనగా:
- విజయలాయ చోళ,
- ఆదిత్య 1,
- పరంటాక చోళ 1,
- గండరాదిత్య,
- అరింజయ చోళ,
- సుందర చోళ,
- ఉత్తమ చోళ,
- రాజ రాజ చోళ 1,
- రాజేంద్ర చోళ 1,
- రాజాధిరాజ చోళ,
- రాజేంద్ర చోళ 2,
- వీరరాజేంద్ర చోళ,
- అతిరాజేంద్ర చోళ
చాళుక్య చోళులు[మార్చు]
సూర్యవంశీయులైన చోళులకు, చంద్రవంశీయులైన చాళుక్యులకు వివాహ సంబంధాల మూలంగా ఆవిర్భవించినవారు చాళుక్య-చోళులు. వీరు క్రీస్తు శకం 1070 నుండి క్రీస్తు శకం 1279 వరకూ పాలించారు. చాళుక్య చోళులలో పాలించిన రాజుల పేర్లు ఏవనగా:
- కుళోత్తుంగ చోళ 1, విక్రమ చోళ, కుళోత్తుంగ చోళ 2, రాజరాజ చోళ2, రాజాధిరాజ చోళ 2, కుళోత్తుంగ చోళ 3, రాజరాజ చోళ2, రాజేంద్ర చోళ 3
బ్రిటీషు వారి కాలం తర్వాత క్షత్రియ రాజుల స్థితి[మార్చు]
బ్రిటీషు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఆక్రమణతో సామ్రాజ్యాలు అంతరించిపోయాయి. క్రమేణా క్షత్రియ వంశస్తులు తమ సామ్రాజ్యాలు విడిచి సామాన్య ప్రజానీకంలో కలిసిపోయారు. విజయనగరం, విశాఖపట్నం,తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో స్థిరపడిపోయారు. కొద్దిగా రాయలసీమకు, తమిళనాడు రాజపాలయానికి, కర్నాటకలో దత్త మండలానికి వలస వెళ్ళారు. కర్నాటకలో స్థిరపడిన రాజులను కర్ణాటక రాజులు అని అందురు. జమీందారీ వ్యవస్థ కొంత కాలం నడిచినా 1947లో భారత దేశ స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఆ జమీందారీ వ్యవస్థ కూడా పోయి సార్వభౌమ అధికార వ్యవస్థ వచ్చింది. జమీందార్లు తమ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించారు, పేదలకు పంచిబెట్టారు. కొద్ది మంది మాత్రమే ధనవంతులుగా మిగిలినా చాలా వరకూ పేదవాళ్ళుగా మిగిలిపోయారు.
గోత్రాలు, గృహనామాలు[మార్చు]
బ్రాహ్మణ గోత్రాల వలె క్షత్రియ గోత్రాలకు కూడా మూల పురుషులు సప్తఋషులు గాని, వారి వంశస్తులుగాని అయివుందురు. గృహనామాలు ఏర్పడక పూర్వం కేవలం గోత్రాలు మాత్రమే వాడుకలో ఉండేవి. 12, 13 శతాబ్దాల తర్వాత ఆంధ్ర క్షత్రియులకు గోత్రాలు బట్టి గృహనామాలు ఏర్పడ్డాయి. ఉత్తర మద్రాస్ ప్రెసిడెన్సీ (శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, కొండపల్లి, గుంటూరు) లో రాజుల గోత్రాలు ఏవనగా - కౌండిన్య, వశిష్ట, ధనుంజయ, కాస్యప. కర్ణాటక రాజులుకు ఆత్రేయ, భరద్వాజ, పశుపతి గోత్రాలున్నాయి. వశిష్ట, కౌండిన్య, కాస్యప గోత్రాలు రాజస్థానీ రాజపుత్రుల్లో కుడా ఉన్నాయి. దీనిని బట్టి ఆంధ్ర క్షత్రియులకు మరియు రాజ పుత్రులకు గోత్ర పురుషులు ఒక్కరేనని, పూర్వమే కొద్దిమంది రాజ్పుట్ కుటుంబాలు దశలవారిగా రాజస్థాన్ నుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చాయని, వారే రాజులుగా పిలువబడుచున్నారని ఒక సిద్ధాంతం కూడా ఉంది. సుప్రసిద్ధ చరిత్ర కారుడైన శ్రీ బుద్దరాజు వరహాలరాజు గారు 1970లో తాను రచించిన శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరములో ధనుంజయ, వశిష్ట, కాస్యప, కౌండిన్య గోత్రములు మాత్రమే పేర్కొన్నారు.
ధనుంజయ గోత్రం[మార్చు]
ధనుంజయ మహారాజు బ్రహ్మర్షి విశ్వామిత్రుడి వంశంలో పుట్టిన వాడు. ఇతడి పేరు మీద ధనంజయ గోత్రం పుట్టినది.
ఋషి ప్రవర:
- 1. శ్రీమద్వైశ్వామిత్ర మధుచ్చంద త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్ర:
- 2. శ్రీమదఘమర్షణ మధుచ్చందో ధనుంజయ త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్ర:
- 3. శ్రీమదాత్రేయ అత్యనానస ధనుంజయ త్రయార్షేయ ప్రవరాన్విత ధనుంజయ గోత్ర:
రాజప్రవర: భరత్ పరీక్షిత్ విష్ణువర్ధన ప్రవరాన్విత కోట హరిసీమ కృష్ణ మహారాజ వంశ'
ధనుంజయ గోత్రములో గృహనామాలు:
1. అడ్డాల; 2. ఈపూరి (వీపూరి); 3. ఉద్దరాజు; 4. ఉయ్యూరి; 5. ఏటికూరి (వేటికూరి); 6. కంకిపాటి; 7. కంతేటి; 8. కమ్మెల (కమ్మెళ్ళ); 9. కళ్ళేపల్లి; 10. కాశి; 11. కూనపరాజు; 12. కూసంపూడి (కూచంపూడి); 13. కొండూరి; 14. కొక్కెర్లపాటి; 15. కొత్తపల్లి; 16. కొప్పెర్ల; 17. కొలనువాడ 18. కొల్నాటి (కొల్లాటి); 19. కొవ్వూరి; 20. గండ్రాజు; 21. గాదిరాజు; 22. గుంటూరి; 23. గూడూరి; 24. గొట్టుముక్కల (గొట్టెముక్కల, గొట్టుముక్కుల); 25. గోకరాజు; 26. చంపాటి (చెంపాటి); 27. చింతలపాటి; 28. చెరుకూరి; 29. చేకూరి; 30. కోటజంపన 31. జుజ్జూరి; 32. తిరుమలరాజు; 33. తోటకూర (తోటకూరి); 34. దండు; 35. దంతులూరి; 36. దాట్ల; 37. నల్లపరాజు; 38. నున్న; 39. పచ్చమట్ల (పట్సమట్ల); 40. పాకలపాటి; 41. పూసంపూడి; 42. పెన్మెత్స (పెనుమత్స); 43. భూపతిరాజు; 44. బైర్రాజు; 45. మద్దాల; 46. ముదుండి; 47. రుద్రరాజు; 48. వడ్లమూడి; 49. వానపాల; 50. వేగిరాజు;
ధనుంజయ గోత్రీకులు చంద్ర వంశీయులైన తూర్పు చాళుక్యులు మరియు ధరణి కోట సామ్రాజ్యాలకు చెందినవారు.
వశిష్ట గోత్రం[మార్చు]
వశిష్ట గోత్రమునకు 2 ఋషి ప్రవరలున్నవి. అవి ఏమనగా:
1.శ్రీ మద్వశిష్ట ఏకార్షేయ ప్రవరాన్విత వశిష్ట గోత్ర:
2.శ్రీమధ్వశిష్టేంద్ర ప్రవదా భరద్వసు త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ట గోత్ర:
రాజప్రవర : రఘులవ గుహిల మహారాజ ప్రవరాన్విత పరిచ్చేది శ్రీ దేవవర్మ మహారాజ వంశ
వశిష్ట గోత్రములో గృహనామాలు:
1. అంగరాజు; 2. అడ్డూరి; 3. అల్లూరి; 4. ఇందుకూరి; 5. ఇసుకపల్లి; 6. ఎర్రగుంటల; 7. ఏటికూరి (వేటికూరి); 8. కాకర్లపూడి; 9. కుచ్చర్లపాటి; 10. కొలుకులూరి; 11. కోసూరి; 12. గణపతిరాజు; 13. గాదిరాజు; 14. గురజాల (గురిజాల); 15. గొడవర్తి; 16. చిలువూరి (చిలుగూరి, శిరుగూరి, శిరువూరి); 17. చెరుకువాడ; 18. చేకూరి; 19. చోడరాజు (చోడ్రాజు); 20. దెందుకూరి; 21. ధేనువకొండ (దీనంకొండ); 22. నంద్యాల (నందేల, నందిళ్ళ); 23. నడింపల్లి (నడిమిపల్లి); 24. పిన్నమరాజు; 25. పూసపాటి; 26. పేరిచర్ల; 27. పొత్తూరి; 28. బుద్దరాజు; 29. బెజవాడ; 30. భేతాళ (భేతాళం); 31. భైర్రాజు; 32. మంతెన; 33. ములగపాటి (మునగపాటి); 34. రావిపాటి (రాయపాటి); 35. వత్సవాయి (వత్సవాయ); 36. వలివర్తి; 37. వాడపల్లి; 38. వెలగలేటి (వెలగనాటి); 39. వేగేశ్న (వేగేశన); 40. వేజళ్ళ (వేజర్ల, వేజండ్ల, యేజర్ల); 41. సఖినేటి (సగినేటి); 42. సాగి; 43. సాగిరాజు; 44. సామంతపూడి
వశిష్ట గోత్రీకులు సూర్యవంశీయులైన పరిచ్చేదులకు చెందినవారు. పరిచ్చేదులకు రాజస్థానీ రాజ్పుట్స్ తో కూడా వైవాహిక సంబంధాలు ఉన్నాయి.
కౌండిన్యస గోత్రం[మార్చు]
కౌండిన్యుడు ఒక గొప్ప వేద పండితుడు. ఇతను వశిష్టుడి వంశంలో జన్మించినవాడు. ఇతని పేరు మీద గోత్రం పుట్టింది.
ఋషి ప్రవర:1. శ్రీమద్వసిష్ట మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత కౌండిన్య గోత్ర
రాజప్రవర : ఇక్షాకశిబి ముచుకుంద ఆదిత్య చోళమహారాజ ప్రవరాన్విత వర్నాట రాజేంద్ర చోళమహారాజ వంశ
కౌండిన్య గోత్రములో గృహనామాలు:
1 . అద్దేపల్లి; 2 . అయినంపూడి; 3 . కలిదిండి; 4 . కునాధరాజు; 5. చిట్రాజు; 6. చేమర్తి; 7 . ముదునూరి; 8. యామనమంద, యీమనమంద, వేములమంద; 9 . వర్ణాటజంపన; 10. సరిపల్లి (సరిపెల్ల)
కౌండిన్య గోత్రీకులు సూర్యవంశీయులైన చోళులకు చెందినవారు.
కాస్యపస గోత్రం[మార్చు]
ఋషులలో కాస్యప ఒక ఋషి. ఇతనికి భార్య అదితి. విష్ణు పురాణం ప్రకారం ప్రజాపతి దక్షుడు తన పదముగ్గురు కూతుర్లను కాస్యపునికి ఇచ్చి వివాహం చేశాడు. ఇతని కుమారులు సూర్య వంశాన్ని స్థాపించారు. కాస్యప వంశంలో పుట్టిన ఇక్ష్వాకుడి తర్వాత సూర్య వంశం ఇక్ష్వాకు వంశంగా కూడా పిలుబడింది.
కాస్యప గోత్రమునకు 2 ఋషి ప్రవరలున్నవి. అవి ఏమనగా:
1.శ్రీ మత్ కాశ్యపా వత్సార నైధృవం భరైభం శండిల శాండిల్య సప్తార్షేయ ప్రవరాన్విత కాస్యపగోత్ర:
2.శ్రీమత్కాస్యపావత్సార నైధృవత్రయార్షేయ ప్రవరాన్విత కాస్యపగోత్ర:
రాజప్రవర: కుశపుండరీక కరికాళచోర మహారాజ ప్రవరాన్విత కాకతీయ ప్రోలరాజ వంశం
కాస్యప గోత్రీకుల గృహనామాలు:
1. ఈదురపల్లి (ఈదరపల్లి); 2. ఉప్పలపాటి; 3. కఠారి, 4. కనుమూరి, 5. గోరింట, 6. నంబూరి, 7. నిడదవోలు 8. పాతపాటి, 9. బెల్లంకొండ; 10. మందపాటి; 11. లఖంరాజు (లకుమరాజు); 12. సయ్యపరాజు ;13. భూమరాజు (భీమరాజు)
కాస్యప గోత్రీకులు సూర్యవంశీయులైన కాకతీయులకు చెందినవారు.
గమనిక : ఏటికూరి, గాదిరాజు, చేకూరి, బైర్రాజు, సాగిరాజు, ఈ 5 గృహనామములును వశిష్ట, ధనుంజయ ఉభయ గోత్రములందును గలవు. ఆంధ్ర క్షత్రియుల్లో స్వగోత్రీకుల మధ్య వివాహాలు నిషిద్ధం. వేర్వేరు గోత్రముల మధ్య మాత్రమే వివాహాలు జరుగుతాయి. 15 వ శతాబ్దాలలో ఆంధ్ర క్షత్రియులలో కొంతమంది తమ గోదావరి ప్రాంతం నుండి దత్త మండలము (రాయలసీమ, కర్నాటకలో బళ్లారి జిల్లాలు) నకు వలస వెళ్ళిపోయారు. అక్కడివారితో వియ్యమొందుట వలన కాలగమనంలో వారి ఆచారాలు కూడా మారినవి, అందువల్ల నేడు వారితో తెలుగు క్షత్రియులకు వివాహ సంబంధములు లేవు. పురాణాల ప్రకారం బృహస్పతి ఋషి కుమారుడైన భరద్వాజ ఋషి క్షత్రియ కన్య యైన సుశీలను వివాహమాడాడు. అనులోమ వివాహం సూత్రం ప్రకారం వీరి సంతతి క్షత్రియులైయ్యారు. అందువల్ల భరద్వాజ గోత్రీకులను బ్రాహ్మణ-క్షత్రియులని చెప్పవచ్చు. వందల సంవత్సరాలుగా ఒక చోటు నుండి మరొక చోటుకు వలసల వల్ల ఆంధ్ర క్షత్రియుల్లో కొన్ని ఇంటిపేర్లు గోత్ర వర్గీకరణకు సాధ్యము కాక అవి శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరంలో అజ్ఞాత గోత్రంగా వర్గీకరించబడినవి. అవి ఏమనగా: అబ్బరాజు, ఉయ్యూరి, ఈనపరాజు, గరికపాటి, పెమ్మరాజు, ఓరుగంటి, పోచిరాజు, బొమ్మిడాల, అమలరాజు, వులిశి, వడ్లమూడి, వెలగలేటి, దుర్గరాజు, దైవనాల. మరికొన్ని గృహమాలు: కీర్థిపాటి; సూరపరాజు; దాసరాజూ
నేడు క్షత్రియేతర కులాలవారు కూడా క్షత్రియులుగా చెలామణి అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో జంగారెడ్డిగూడెంలోని అప్ లాండ్ క్షత్రియ సేవా సమితి వారు 2012 టెలీఫోన్ డైరెక్టరీలో మనుబోలు అను గృహనామం వసిష్ట గోత్రంలోను, యరకరాజు అను గృహనామం ధనుంజయ గోత్రంలోను కలిపారు. ఇదే కాకుండా శ్రీవీరప్రతాపకోరుకొండ హంవీర, కోరుకొండ (భరద్వాజ గోత్రము); శ్రీనాధరాజు, ఓరుగంటి (ఆత్రేయ గోత్రము) ; యీర్ల (జాభళ గోత్రము); పెంచికలపాటి (గౌతమ గోత్రము); శ్రీరాజా మధువీటి, శ్రీరాజారాఘవరాజు (కాశ్యపస గోత్రము); బహుబలేంద్రుని (మౌనమిస గోత్రము); గూడెపు (హరతస గోత్రము); లంకపల్లి (అంగీరస గోత్రము); స్వామిరాజు (జమదగ్ని గోత్రము); యావన్మంది అను గృహనామాలను కూడా ప్రచురించారు. అయితే వివిధ కవులు వ్రాసిన ఆంధ్ర క్షత్రియ గృహనామ సీసమాలికల బట్టి ఈ గృహనామాలు ఆంధ్ర క్షత్రియులకు చెందినవి కాదని తెలుస్తున్నది.
ఇతర కులాల్లో గృహనామాలు[మార్చు]
క్షత్రియులకు గృహనామాలు 80 గ్రామనామాలు బట్టి, 20 పూర్వీకులలో ప్రసిద్ధులైనవారి పేర్లు బట్టి, 1 లక్షణం బట్టి, 8 ఇతర కారణాల వల్ల ఏర్పడ్డాయి. అయితే గ్రామ నామమే గృహ నామంగా మారినప్పుడు ఒక కులంలో ఉన్న గృహ నామం వేరొక కులంలో కూడా ఉండవచ్చును. ఈ కారణంగా క్షత్రియుల ఇంటిపేర్లలో కొన్ని ఇతర కులాల్లో కూడా ఉన్నాయి. తెలుగు బ్రాహ్మణ కులంలో అవి ఏమనగా - బుద్దరాజు, గణపతిరాజు, గరికపాటి, కఠారి, కాకర్లపూడి, నడింపల్లి, సరిపల్లి, వడ్లమూడి, గాదిరాజు, కొండూరి, నంబూరి. కాపు కులంలో ఏమనగా - కోసూరి, కఠారి. భట్ట రాజులు కులంలో ఏమనగా - అబ్బరాజు, అల్లూరు, బాలరాజు, ధేనువుకొండ, గాదిరాజు, నండూరి, నడింపల్లి, నాగరాజు, పూసపాటి. కమ్మ కులంలో ఏమనగా- ఉప్పలపాటి, కంతేటి, కొత్తపల్లి, కోసూరు, గరికపాటి, గోకరాజు, చెరుకూరి, నాగరాజు, బెల్లంకొండ, రాయపాటి, బెజవాడ, చేకూరి, గురిజాల, ఇసుకపల్లి, కనుమూరి, కఠారి, మద్దాల, నడింపల్లి, నందిళ్ళ, నంబూరి, నున్న, పొత్తూరి, వడ్లమూడి. ఉయ్యూరి.
సంస్థానాలు - పరిపాలన[మార్చు]
ఈస్ట్ ఇండియా కంపెనీ వారు భారత దేశాన్ని పరిపాలించు కాలంలో జమీందార్లుగా అల్లూరు వారు చించినాడను; ఉప్పలపాటి వారు ముత్త తలగ చీరాలను; సాగివారు సర్వసిద్ధిని; వత్సవాయి వారు తుని ని; భూపతిరాజు వారు రెవిడి, మద్గోలు, గోలుగొండ ప్రాంతాలను; పూసపాటి వారు కాశీపురం, కుమిలి, ఉప్పడ, రాజమండ్రి ప్రాంతాలను; అల్లూరి వారు చింతలపల్లి ప్రాంతాలను; కనుమూరి వారు రాజోలు ను; దంతులూరి వారు ఉరట్ల ప్రాంతాలను; చింతలపాటి వారు దార్లపూడి ప్రాంతాలను; పిన్నమరాజు వారు కొత్తకోట ప్రాంతాలను; కలిదిండి వారు మొగల్తూరు ప్రాంతాలను పరిపాలించారు. పల్నాడు యుద్ధంలో పాల్గొన్న సాగి పోతరాజు పెద్దాపురం పట్టాణాన్ని నిర్మించాడు. అమలరాజు విజయనగరంలో పూసపాడుని నిర్మించాడు. పూసపాటి వారు బెజవాడ (ఇప్పటి విజయవాడ) నగరాన్ని నిర్మించారు.తూర్పుగోదావరి జిల్లారామచంద్రపురంలో కాకర్లపూడి వంశీకులు నిర్మించిన కొట ఉంది. ఆ కోటలో ఇప్పటికీ వారి వంశస్తులు నివసిస్తున్నారు.
ఆచార వ్యవహారాలు[మార్చు]
బ్రాహ్మణుల వలే రాజులు కూడా ద్విజులు. - అనగా ఉపనయనము (ఒడుగు) సమయంలో జంద్యము (యజ్ఙోపవీతం) ధరించే ఆచారం ఉంది. బారసాల, కేశఖండనం, ఉపనయనం, కన్యాదానం, కాశీ యాత్ర వగైరా ఉన్నాయి. వర్ణాశ్రమ ధర్మం ప్రకారము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాత్రమే ఇవి పాటిస్తారు. ఇతర కులాల్లో మాత్రం ఇవి లేవు.
అపోహలు[మార్చు]
- సూర్యవంశము వారు చంద్రవంశము వారి కంటే గొప్పవారని కొద్దిమందిలో అపోహ ఉంది. ఇది వాస్తవం కాదు. వాల్మీకి రామాయణం ప్రకారం చంద్రవంశానికి చెందిన మిధిల జనక మహారాజు తన కుమార్తె అయిన సీతాదేవిని సూర్యవంశానికి చెందిన ధశరధ మహారాజు కుమారుడైన శ్రీరాముడుకి ఇచ్చి వివాహం చేశాడు. చాళుక్యులు చంద్రవంశీయులు, చోళులు సూర్య వంశీయులు. రాజరాజచోళుని కుమార్తె 'సుతకందవ' తూర్పు చాళుక్యుడైన విమలాదిత్యుని భార్య. 1వ రాజేంద్ర చోళుని కుమార్తె అమ్మంగై దేవి తూర్పుచాళుక్య రాజకుమారుడు రెండవ రాజేంద్రుడు అనే కుళోత్తుంగుని భార్య. సూర్యవంశం కాకాతీయ సామ్రాజ్యానికి చెందిన గణపతి దేవుడు తన పెద్ద కుమార్తె రుద్రమదేవిని చంద్ర వంశం తూర్పు చాళుక్య రాజైన వీరభద్రునికి ఇచ్చి వివాహం చేశాడు, రెండవ చిన్న కుమార్తె గణపాంబను ధరణికోట రాజైన బెతరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. ఇలా వేలాది సంవత్సరాల నుండి సూర్య, చంద్ర వంశముల మధ్య వివాహములు జరుగుచున్నవి. అందువల్ల ఒక వంశము రెండవ వంశముపై ఆధిక్యత సంక్రమించదు. ఎవరి ఘనత వారిదే. కనుక ఆంధ్ర క్షత్రియులలో సూర్య, చంద్ర వంశములు సమానములే.[2].
- కమ్మ, బోయ వంటి వారు క్షత్రియులని వాదించేవారున్నారు. ఇందులో వాస్తవం లేదు. వీరు ద్విజులు కారు, అనగా ఉపనయనం (ఒడుగు) సమయంలో జంధ్యం (యజ్ఙోపవీతం) ధరించరు. పై పెచ్చు వీరికి క్షత్రియ గోత్రాలు, సూర్య, చంద్ర వంశాలు లేవు. ఏ కులాన్నైనా గుర్తించాలంటే ఆచార వ్యవహారాలే మూలము కనుక కమ్మ, బోయ వంటి వారు క్షత్రియులు కారు అని చెప్పవచ్చును.
- క్షత్రియులు అనగా ఒక్క రాజపుత్రులు (Rajputs) మాత్రమే అని, ఇంకెవ్వరూ కారని కొందరిలో అపోహ ఉంది. ఇందులో వాస్తవం లేదు. భారత దేశాన్ని ఎన్నో క్షత్రియ వంశాలు పాలించాయి. అందులో ఉత్తర భారత దేశాన్ని ఏకశ్చత్రాధిపత్యంగా ఏలిన క్షత్రియుల్లో రాజపుత్రులు ఒకరు.
ప్రస్తుత స్థితి[మార్చు]
ఆంధ్ర క్షత్రియ సామ్రాజ్యాల వంశస్తులు నేడు గొదావరి జిల్లాలలో రాజులుగా పిలువబడుచున్నారు. వీరి పేర్ల చివర ఎక్కువగా రాజు లేక వర్మ [3] అని ఉంటుంది. అయితే ఈమధ్య యస్.సి సామాజిక వర్గాల్లో కూడా కొంతమంది వ్యక్తులు తమ పేర్లకు వర్మ అని తగిలించుకోవడం జరుగుచున్నది. ఆంధ్ర రాజులను గృహనామాలు, మరియు గోత్రాల పేర్లు బట్టి వీరిని గుర్తుబట్టవచ్చును. భారతీయ కుల వర్గీకరణ వ్యవస్థ ప్రకారం నేడు ఆంధ్ర దేశంలో వీరు ఇతర కులాల (O.C) విభాగానికి చెందుతారు [4] . భారతదేశం సార్వభౌమాధికార దేశంగా ఆవిర్భవించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న క్షత్రియ కుటుంబాలను క్షత్రియ కులంగా వర్గీకరించింది. ఆ క్రమంలో ఆంధ్రదేశంలో ఉన్న క్షత్రియ కుటుంబాలవారు కూడా క్షత్రియులు (లేక రాజులు) గా వర్గీకరించబడ్డారు. ప్రస్తుతం క్షత్రియుల జనాభా ఆంధ్రప్రదేశ్ లో కేవలం 1% మాత్రమే ఊన్నారు.
ఒకప్పుడు రాజ్యాలేలిన వీరు, ప్రస్తుతం ప్రధానంగా వ్యవసాయం, వ్యాపారరంగం, పారిశ్రామిక రంగం, వివిధ సేవారంగాలైన విద్య, సినిమా, సాంకేతిక రంగం మొదలైన రంగాలలో విస్తరించి యున్నారు. ఈ రంగాలలో వీరు గణణీయమైన అభివృద్ధిని సాధించి, ఆంధ్రప్రదేశ్ సమాజంలో ప్రముఖులుగా పరిగణింపబడుతున్నారు. ఇటీవల వీరిలో చాలా మంది హైదరాబాదు నగరంలోనూ, అమెరికాలోనూ స్థిరపడ్డారు. నేడు ఆంధ్ర క్షత్రియుల్లో కొద్ది మంది మాత్రమే ధనవంతులుగా ఉన్నా చాలా వరకూ దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారు. వీరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువ. అందుచేత రిజర్వేషన్ సిష్టమ్ కేవలం కులాన్ని బట్టి కాకుండా ఆర్థిక స్థితిని బట్టి ఉంటే న్యాయమని సామాజిక విశ్లేషకుల భావన.
ఆంధ్ర రాజుల్లో వలసలు ఎక్కువ. ఎక్కడ ఆర్థిక అభివృద్ధి ఉంటే అక్కడకు వలస వెళ్ళిపోతారు. అందువల్ల ఎక్కడ చూసినా వీరి జనాభా 1% కంటే మించదు. ఇతర కులాలవారిలో ఉన్న ఐక్యత దురదృష్టవశాత్తు ఆంధ్ర రాజుల్లో ఇప్పటికీ సరిగా లేదు. ఇది రాచరికపు కాలం నుండీ ఉంటున్న సమస్య. కోడిపందాలు, పేకాట, క్రికెట్ పందాలు మరియు ఇతర జూదాలు ఆడి ఆస్తులను కోల్పోయిన ఆంధ్ర రాజులు నేడు ఎంతోమంది ఉంటున్నారు. చదువులు-ఉద్యోగాల వల్ల విచ్చలవిడితనానికి అలవాటుపడిన క్షత్రియ యువతులు తమకు ఇష్టమైన వ్యక్తులతో పారిపోయి పెళ్ళిచేసుకోవడం జరుగుచున్నది. ఇందువల్ల ఆంధ్ర రాజుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవుచున్నది. క్షత్రియులుగా చెప్పుకొనే ఇతర కులాలవారు కూడా నేడు లేకపోలేదు.
సేవా సంస్థలు[మార్చు]
క్షత్రియ సేవా సంస్థలు దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాపంగా ఏర్పడ్డాయి. ప్రస్తుతము ఆంధ్ర క్షత్రియులు మరియు రాజస్థానీ రాజపుత్రులు కలిసికట్టుగా ఏర్పడిన అఖిల భారత క్షత్రియ సంఘానికి (All India Kshatriya Federation - AIKF) రాజ్ పుట్ వంశానికి చెందిన నరేంద్ర సింగ్ రాజావత్ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీటి సదస్సులు ఆర్థికంగా వెనుకబడిన క్షత్రియ విద్యార్థినీ విద్యార్థులకు, వయో వృద్ధులకు మేలు జరిగే విధంగా కేవలం మహా నగరాల్లోనే కాకుండా గ్రామ స్థాయిలో కూడా నిర్వహించవలసిఉంది.
అఖిల భారత క్షత్రియ సంఘానికి సుమారు 50కి పైబడి అనుబంధ సంస్థలు ఉన్నాయి.
1.మహారాణా ప్రతాప్ శిక్షణ్ సంస్థ - మహారాష్ట్ర, 2. రాజు క్షత్రియ వెల్పేర్ అసోసియేషన్ - మైసూర్, 3. రాజు క్షత్రియ వెల్పేర్ అసోసియేషన్ -బెంగుళూరు, 4. క్షత్రియ సేవా సంఘము - విజయవాడ, 5. క్షత్రియ సేవా సమితి - భద్రాచలం, 6.క్షత్రియ సేవా సమితి -రాజమండ్రి, 7. కోనసీమ క్షత్రియ సేవా సమితి - అమలాపురం, 8. క్షత్రియ సేవా సమాఖ్య - నిడదవోలు, 9. క్షత్రియ సంక్షేమ పరిషత్తు - పాలకొల్లు, 10. శ్రీ అల్లూరి సీతారామరాజు సేవాసమితి - భీమవరం, 11. రాజ పుత్ర హితకరిణి సభ - గ్వాలియర్, 12. అఖిల భారతీయ మహాసభ - హైదరాబాదు, 13. రాయలసీమ క్షత్రియ సేవా సమితి - సికింద్రాబాదు, 14. వీరేంద్ర సింగ్ రాధోర్ - అస్సాం, 15. క్షత్రియ సమాజ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా - నాగ్ పూర్, 16. క్షత్రియ సేవా సమితి - హైదరాబాదు, 17. ప్రతాప్ వాహిని కళ్యాణ్ సంస్థాన్ - గ్వాలియర్, 18. రాజపుట్ క్షత్రియ సమాజ్ - మధ్యప్రదేశ్, 19. మధ్యప్రదేశ్ రాజ్ పుట్ సమాజ్ - భోపాల్, 20. శ్రీ రాజ్ పుట్ సభ - జైపూర్, 21. క్షత్రియ రాజ్ పుట్ సభ - హైదరాబాదు, 22. హర్యానా రాజ్ పుట్ ప్రతినిధి సభ - హర్యానా, 23. అఖిల్ భారతీయ క్షత్రియ మహాసభ - ముంబై, 24. క్షత్రియ సంక్షేమ సమితి - విశాఖపట్నం, 25. మహారాజా కర్ణదేవ్ మెమోరియల్ ట్రస్ట్ - అహమ్మదాబాద్, 26. శ్రీ రాజ్ పుట్ స్పోర్ట్ & స్టడీ సర్కిల్ - జాం నగర్ (గుజరాత్), 27. అఖిల్ గుజరాత్ రాజ్ పుట్ యవ సంఘ్ - గుజరాత్, 28. రాజు క్షత్రియ సంఘ్ - బెంగుళూరు, 29. మహారాణా ప్రతాప్ సమాజ్ కళ్యాణ్ పరిషత్ - భోపాల్, 30. క్షత్రియ పరిషత్తు - కాకినాడ. 31. రాయలసీమ క్షత్రియ సేవా సంఘము, తిరుపతి, 32. క్షత్రియ సేవా సమితి, కైకలూరు, 33. క్షత్రియ పరిషత్, విజయనగరం, 34.అల్లూరి యువజన సేవా సంఘం, ఓబులవారిపల్లి-కడప జిల్లా, 35. శ్రీ గురు కృప శిక్షా సంస్థాన్, గ్వాలియర్, 36. మహారాణా ప్రతాప్ చారిటబుల్ ట్రస్ట్, బివాని- హర్యానా, 37. ఆల్ ఇండియా రాజ్ పుట్ స్టూడెంట్ ఎయిడ్ సొసైటీ, చండీగర్, 38. ఫెడరేషన్ యువజన సంఘం, హైదరాబాదు, 39. రాజస్థాన్ రాజ్ పుట్ పరిషత్, వెస్ట్ ముంబై, 40. J.D.M.V.P. కోఆపరేటివ్ సమాజ్ లిమిటెడ్, జల్గాన్, 41. అల్లూరి సీతారామరాజు కల్చరల్ అసోసియేషన్, బెంగళూరు, 42. సంస్కృతి ట్రస్ట్, బెంగుళూరు
This comment has been removed by the author.
ReplyDeletehi mahesh, mana kshatriyulaku gala pedda problem idey,, i am also from arey kshatriya but i am from telangana,, mahesh garu e number ki call cheyandi manam discuaa chedham 9398663256
ReplyDeleteVadiyarajulu vadderajulu orissa gajapathi rajulu okkatenaaaa
ReplyDeleteవడియారాజులు,ఒరిస్సారాజులు,ఓడ్రగజపతిరాజులు,వద్ధి రాజులు అంత ఒకటే
ReplyDeleteVadiya rajulu surnames googles lo ravadam ledhu
DeleteOrissa Gajapati rajulu yadava,yadu vamseeyulu
ReplyDeleteKanchipati surname vasistha gotram pls online relationship bhupathiraju, kakarlapudi, kutcharlapati, byrraju, mandapati, vizianagaram
ReplyDeleteKunchapu gotra ಐಸ್ delit why.. ?!
ReplyDeleteCHALLA SURNAME VASISHTA GOTRAM
ReplyDeleteఆంధ్రప్రదేశ్ నిజమైన రాజులు ఎవరూ?
ReplyDeleteఆంధ్ర oc ఉన్నా రాజులకి bcలో ఉన్న భట్ట రాజులకి వివాహాలు జరుగుతాయా? ఎందుకు అంటే ఈ రెండూ వంశాల ఆచారాలు ఒకేలా ఉంటాయి.
ReplyDelete